చల్లగాలికి తెలుసా
నీ మనసు స్పర్శ
మల్లెపూవుకు తెలుసా
నీ మది వర్ణం
సన్నజాజికి తెలుసా
నీ మానవతా పరిమళం
రాలే తొలకరులకు తెలుసా
నీ నవ్వులోని అహ్లాదం
ఉదయవేకువలకు తెలుసా
నీ నడకలోని హొయలు
పాడే కోయిలకు తెలుసా
నీ స్వరంలోని సుస్వరం
మరి సెగలు రువ్వే సూర్యునికి తెలుసేమో
నీలోని మోహపు జ్వాలాకాంతులు.....