Sunday, December 16, 2007

చెలియా


అందమా

నీ పరిచయంతో ఆనందానికి

నా మది ఆహ్వానం పలికింది

పరువమా

నీ పరిచయంతో పరవశం

నా మనస్సును పలుకరించింది

ప్రియతమా

నీ పరిచయమే నాకు

ప్రేమకున్న విలువను తెలిపింది

నిజం సుమా

నీ పరిచయంతోనే

నా జీవన గమ్యానికి

ఓ మార్గం దొరికింది.