Wednesday, December 19, 2007

నేను-ఆమె

నేను ఆమెతో కలిసి నమ్మకమనే పూలకుండిలో

ఓ గులాబీ మొక్కను నాటాను.

దానికి స్నేహమనే అమృతాన్ని పోసి పెంచుకున్నాం.

నాకూ ఆమెకూ తప్ప మరెవరికీ కనిపించని


మనసనే విశాల ప్రపంచంలో

అది దినదిన ప్రవర్థమానమై

ఆకులూ రెమ్మలూ వేసింది.

మా నిరీక్షణ ఫలించి కొన్నాళ్ళ తర్వాత

ఆ గులాబీ కన్యమొగ్గ తొడిగింది.

దానిపట్ల మా ప్రేమ రెట్టింపయ్యింది.

మొగ్గవిడి స్వచ్ఛమైన తెల్లగులాబీ విరబూస్తుందనుకున్నాం.

అయితే కొన్నాళ్ళ తర్వాత

పచ్చని చిగుళ్ళను చీల్చుకుంటూ

వచ్చిన గులాబీ రేకును చూసి

ఇద్దరం ఆశ్చ్ర్యపోయాం.

అది....................ఎర్రగులాబీ.

మా హృదయ గానం విని

అది మరింత రాగరంజితమైంది.