Sunday, December 16, 2007

ప్రియతమా..


నీ కలల తీరాలను తాకగలను

వేదన నదిలో ముంచి వెళ్లు !

నీ గతం ఎంత కోత పెట్టింది చూడు ?

భవితవైపు మళ్ళించి వెళ్ళు !

నీవు కాదంటే తట్టుకోలేను నేను

కాస్త ద్వేషాన్ని పంచివెళ్ళు

గాలి శ్వాసలు ప్రాణాన్ని నింపలేవు

హృదయగాయం ప్రజ్వలించి వెళ్ళు

ఈ వియోగం సుదూరమై సాగుతుంది......

జ్ఞాపకం తోడు ఉంచి వెళ్ళు !